అభివృద్ధిని అడ్డుకునేలా కాంగ్రెస్ చర్యలు
నిర్మల్, ఏప్రిల్ ౧5 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన 15 కోట్ల నిధుల పనుల టెండర్లను నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ లో రద్దు చేస్తాం అనడం హేయమైన చర్య అని, ఇది అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. ఈ విషయమై బుధవారం బీజేపీ నాయకులు కలెక్టర్, సంబంధిత శాఖ అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికే ఇలా చేస్తుందంటూ మాట్లాడటం హాస్యా స్పదం అన్నారు. కాంగ్రెస్ పార్టీనే జిల్లాలో తమ ఉనికి కాపాడుకునేందుకు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, ముత్యం, ధర్మాజీ గారి ఈశ్వర్, విఠల్, ఖమ్మం సురేందర్‌తో పాటు పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






