ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాలి
కామారెడ్డిలో విద్యుత్ కార్మికుల నిరసనలు
కామారెడ్డి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి కష్టపడి పని చేసినా తమకు గుర్తింపు లేదని, ఎన్నికలకు ముందు తమను పర్మినెంట్ చేస్తామని వాగ్దానాలు చేసి అనంతరం మరిచారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, విద్యుత్ సంస్థలో ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలని ఆర్టిజన్ హనుమాన్ స్పా ట్ బిల్లర్స్ పీస్ రేటు విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది.
ఈ రోజు కళ్లకు గంతలు కట్టుకొని, వంటావార్పు కార్యక్రమంతో కామారెడ్డి సూపరింటెండెంట్ కార్యాలయం ముం దు నిరసన చేపట్టారు. 8 రోజులు గడుస్తున్నా తమను చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమన్నారు. జెన్కో, ట్రాన్స్, ఎస్పీడీసీఎల్, ఎన్పీ డీసీఎల్ వందలాది మంది కార్మికులు మండుటెండల్లో నిరసన కొనసాగించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, బిచ్కుంద డివిజన్ కేంద్రాలతో పాటు మండల కేంద్రా లు సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కార కోసం అనేక పర్యాయాలు ప్రభు త్వం యజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగారు.






