15 June, 2026 | 11:43 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్–బీజేపీ సయోధ్య

17-02-2026 06:13 PM

చైర్మన్ కాంగ్రెస్… వైస్‌ చైర్మన్ బీజేపీ

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా కాగజ్‌నగర్‌లో కొత్త రాజకీయ సమీకరణకు నాంది పడింది. సాధారణంగా పరస్పర విభిన్న సిద్ధాంతాలు కలిగిన జాతీయ పార్టీలు అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ స్థానిక రాజకీయ అవసరాల దృష్ట్యా పరస్పరం మద్దతు ఇచ్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అవసరమైన మెజార్టీ కోసం స్థానిక స్థాయిలో రాజకీయ లెక్కలు మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ రెండు పార్టీలు, ఇప్పుడు అధికార సమీకరణాల నేపథ్యంలో కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాల కంటే అధికారమే ప్రధానమనే ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 11, కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 5, ఎంఐఎంకు 1, స్వతంత్రులకు 4 వార్డులు దక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి 16 మంది సభ్యుల మెజార్టీ అవసరం కాగా, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌కు స్వతంత్రులు, ఎంఐఎం మద్దతు తెలిపినా వారి సంఖ్య 14కే పరిమితమైంది. బుధవారం పురపాలక కార్యాలయానికి సభ్యులు హాజరైనప్పటికీ కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరి, చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు, వైస్‌ చైర్మన్ పదవి బీజేపీకి ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం.