హైదరాబాద్ లో యెజ్దీ స్క్రాంబ్లర్, బీఎస్ఏ స్క్రాంబ్లర్
హైదరాబాద్: యెజ్డీ మరియు బీఎస్ఏలు తమ కొత్త స్క్రాంబ్లర్స్ రీటైల్ విడుదలను ప్రకటించాయి, అవి ఇప్పుడు హైదరాబాద్ తమ అథీకృత డీలర్ షిప్స్ లో లభిస్తున్నాయి. నగరాల్లో సౌకర్యవంతంగా, జాతీయ రహదారులపై స్థిరంగా మరియు ట్రయల్స్ లో ఉత్తేజకరంగా ఉండే వాహనం కోసం పరిశీలిస్తున్న రైడర్ కోసం, అసలైన స్క్రాంబ్లర్ వారసత్వం ఉన్న బ్రాండ్స్ వేరు ధరల్లో రెండు విలక్షణమైన మోటార్ సైకిల్స్ ను అందిస్తున్నాయి.
యెజ్డీ స్క్రాంబ్లర్ 350 మరియు బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650లు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ ట్రైయిన్స్ తో పాటు శక్తివంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉన్నాయి. భారతదేశపు తేలికైన 350 సిసి స్క్రాంబ్లర్, చురుకైన యెజ్డీ స్క్రాంబ్లర్ లు పట్టణంలో ప్రయాణించడానికి మరియు వారాంతాల్లో విహారాల కోసం తీర్చిదిద్దారు. కొత్త లిక్విడ్-కూల్డ్ కటార్ ఇంజన్ తో ఇది రూ. 1,99,950 పరిచయ ధరతో ప్రారంభమవుతోంది.
శ్రేణిలో భారతదేశపు ఏకైక 650 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ తో శక్తిని పొందే బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 అసలైన బ్రిటిష్ స్క్రాంబ్లర్ శైలిని, తక్కువ మరియు మధ్య శ్రేణిలో లభించే శక్తివంతమైన టార్క్ పనితీరుతో రూపొందించారు. ఇది బీఎస్ఏ యొక్క ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ స్టార్ కటాలినా, ఏ10 స్పిట్ ఫైర్, మరియు ఏ65 ఫైర్ బర్డ్ వంటి చారిత్రక దిగ్గజాల నుండి తన ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందింది. ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధరను రూ. 3,24,950గా నిర్ణయించారు.
స్క్రాంబ్లర్స్ కు మోటార్ సైక్లింగ్ ప్రపంచంలో ఎస్ యూవీలుగా మారే సామర్థ్యం ఉందనీ. ఇవి తమ మోటార్ సైకిల్స్ పై రైడర్స్ కు ఉన్న అంచనాలను శాశ్వతంగా మారుస్తాయనీ క్లాసిక్ లెజెండ్స్ కో ఫౌండర్ అనుపమ్ థరేజా వ్యాఖ్యానించారు. సరికొత్త స్క్రాంబ్లర్స్ , యెజ్డీ మరియు బీఎస్ఏ మోటార్ సైకిల్స్ యొక్క పూర్తి శ్రేణిని వీక్షించేందుకు కస్టమర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో డీలర్ షిప్ ను సందర్శించవచ్చనీ తెలిపారు.






