ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ
15-06-2026 09:37 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సందేళ్ల రామాపురం గ్రామం వద్ద ఇసుక లారీ ఆటోని వెనకనుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం మొరంపల్లి బంజర్ కి చెందిన ఆటో డ్రైవర్ వెంకన్న భద్రాచలం నుండి ఇంటికి వెళ్తుండగా వెనకనుంచి ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ ను మోరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






