calender_icon.png 1 February, 2026 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుసాపూర్‌లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం

01-02-2026 12:35:10 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపురం గ్రామంలో అర్ధరాత్రి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

చిట్ విచారణ పేరుతో కేసీఆర్‌కు అర్ధరాత్రి ఆయన నివాస గేటుకు నోటీసులు అతికించి, అదే రోజే హాజరుకావాలని ఆదేశించడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ చర్యలు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుగా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల కనకయ్య, నాంపల్లి, యూత్ నాయకుడు రేగుల శ్రీనివాస్, ముత్తయ్యతో పాటు పలువురు కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.