16 April, 2026 | 6:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నెల చివరి వరకు పోలీస్ యాక్టు అమలు: ఎస్పీ డి జానకి

01-02-2026 12:39 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలలో ఉంటుందని,​శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(A) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... ​పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదన్నారు. ​

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ​చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. ​జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుండా ఈస్టునుసారంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.