calender_icon.png 1 February, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేటలో ముగిసిన సీఎం కప్ క్రీడలు

01-02-2026 12:32:07 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సీఎం కప్ మండల స్థాయి క్రీడలు నాగిరెడ్డిపేటలో శనివారంతో ముగిసాయి.సీఎం కప్ మండల స్థాయి క్రీడలను మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులపాటు నిర్వహించారు.ఈ సీఎం కప్ క్రీడల్లో కబడ్డీ,వాలీబాల్,నెట్ బాల్,ఖోఖో,అట్లాటిక్స్లో అండర్ 14 నుండి అండర్ 20 వరకు రన్నింగ్ పోటీలను నిర్వహించారు. కబడ్డీ బాలుర విభాగంలో విన్నర్ గా బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందగా,రన్నర్గా ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు.

కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్గా ఆత్మకూర్,రన్నర్గా మాల్తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు నిలిచారు.వాలీ బాల్ క్రీడల్లో విన్నర్గా నాగిరెడ్డిపేట్, రన్నర్గా మాల్తుమ్మెద పాఠశాలల విద్యార్థులు నిలిచారు.నెట్ బాల్ క్రీడల్లో బాలికల విభాగంలో విన్నర్గా మాల్తుమ్మెద,రన్నర్గా తాండూర్ పాఠశాల విద్యార్థులు నిలిచారు.నెట్ బాల్ బాలుర విభాగంలో విన్నర్గా తాండూర్,రన్నర్గా మాల్తుమ్మెద పాఠశాలల విద్యార్థులు నిలిచారు.ఖోఖో క్రీడల్లో బాలికల విభాగంలో విన్నర్గా బొల్లారం, రన్నర్గా ఆత్మకూర్ పాఠశాలల విద్యార్థులు నిలిచారు.

బాలుర విభాగంలో విన్నర్గా బొల్లారం, రన్నర్గా ఆత్మకూరు పాఠశాల విద్యార్థులు గెలుపొందారు.సీఎం కప్లో గెలుపొందిన విద్యార్థులకు 40 వేల,,రూపాయల విలువైన ట్రోఫీలు, షీల్డ్లు ఇతర బహుమతులను మండలంలోని చినూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు కొండ మీరా తాయి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్,ఇన్చార్జ్ ఎంఈఓ వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.