22 April, 2026 | 12:03 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి

12-05-2024 01:43 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, మే 11: భువనగిరి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. శనివా రం మునుగోడులో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. వ్యాపారులు, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిం చారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిందని, అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడులో అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, వేంరెడ్డి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, నాయకులు పాల్గొన్నారు.