22 April, 2026 | 1:29 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బీసీ వ్యతిరేకి బీజేపీ

12-05-2024 01:42 AM

 కాంగ్రెస్‌కు మద్దతుగా బీసీ కుల సంఘాల తీర్మానం

 బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ అని, బీసీ కులగణన చేయని బీజేపీకి బీసీల ఓట్లు అడిగే హక్కులేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని ఫతే మైదాన్ క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన  “సమగ్ర కులగణన రిజర్వేషన్ల పెంపు” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఈ ఎన్నికలు మండల్, కమండల్ వారసుల మధ్య జరుగుతున్నవిగా  అభివర్ణించారు. ఇండియా కూటమిని బీసీలు గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు మద్దతుగా 130 బీసీ కుల సంఘాలు తీర్మానం చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.