22 April, 2026 | 1:22 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

22-04-2026 11:50 AM
  1. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురికి నీరు...
  2. చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయకుండా కాల్వ పక్కన పడేస్తున్న వైనం...
  3. పట్టింపు లేని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు...
  4. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు...
  5. గ్రామంలో పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్...

బాన్సువాడ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే పథకాన్ని 99 రోజులపాటు గ్రామాలతో పాటు పట్టణ మండల ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పథకం ద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలున్న పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ వెంటనే శుభ్రపరిచి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలలో పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశ పేట గ్రామంలో ఎక్కడ చూసిన అస్తవ్యస్తంగా పారిశుద్ధం రోడ్లపై కాలనీలలో కనిపిస్తోంది. మురికి నీరు బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

గ్రామాల్లో నూతన పాలకవర్గం ఏర్పాటైనప్పటికీ కాలనీలో నెలకొన్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఏ కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్తం మురికి నీరు రోడ్లపై పారడం చెత్తాచెదారం పేరుకుపోవడం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించాల్సిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యదర్శి కారోబార్ పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం లేదని గ్రామ ప్రజలు పేర్కొనడం గమనార్హం. ప్రతిరోజు డ్రైనేజీల శుభ్రం చేయాలని చెత్తాచెదారాన్ని తొలగించాలని మురికినీరు పారకుండా నియంత్రించాలని గ్రామ కార్యదర్శి తో పాటు పాలకవర్గ సభ్యులకు కారోబార్కు వెల్లడించినప్పటికీ పట్టించుకునే పాపాన లేదని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. దేశాయిపేట గ్రామంలోని ఆరవ వార్డులో ఎక్కడ చూసినా చెత్తాచెదారం మురికి మీరు బురదమయం కనిపిస్తుంది.

కాలనీ నుండి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కాల్వకు వెళ్లే రహదారిలో పూర్తిగా చెత్తాచెదారం ఉండడంతో దుర్వాసన వెదజల్లడం దోమలు వ్యాపించడంతో రోగాల బారిన పడుతున్నారని వెంటనే శుభ్రపరిచి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా గ్రామ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామ కారోబార్ మాత్రం పట్టించుకోవడంలేదని ఎన్నిసార్లు చెప్పినా పారిశుద్ధం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. అదేవిధంగా పలు వార్డుల్లో వీధి దీపాలు లేక రాత్రివేళలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్డు ప్రజలు కోరుతున్నారు.

ప్రతిరోజు గ్రామంలోని అన్ని వార్డుల్లో పేర్క పైన చెత్తాచెదారాన్ని తొలగించి ట్రాక్టర్లలో గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ లో వేయాల్సి ఉన్నప్పటికీ గ్రామ శివారులో రోడ్డు పక్కనే ఇండ్ల మధ్యలోనే చట్టా చదారాన్ని వెయ్యడం అదేవిధంగా మురికి నీరును గ్రామ శివారు వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇండ్ల మధ్యనే మురికి నీరు పేరుకపోయి బుర్దమయంగా మారడం దోమలు వ్యాపించడం ప్రజలు రోగాల బారిన పడడం జరుగుతుందని జ్వరాల బారిన పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు కానీ గ్రామ కార్యదర్శి గాని వెంటనే స్పందించి పరిశుభ్రతను పాటించి ప్రజలు రోగాల బారిన పడకుండా గ్రామంలోని అన్ని వార్డులను శుభ్రపరచాలని మురికి నీరును తొలగించాలని వీధి దీపాలను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.