15 May, 2026 | 5:41 PM

పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది

15-05-2026 04:29 PM

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ,(కొండ మల్లేపల్లి),(విజయక్రాంతి): పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అని  దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్  విమర్శించారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నాలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం అనంతరం. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్  పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతులు 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని, నెలరోజులుగా తమ పంటను అమ్ముకోలేక నష్టపోతున్నారని తెలిపారు.

బ్యాగులు లేకపోవడం, కాంటా సదుపాయం లేకపోవడం, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా స్థంభించాయని పేర్కొన్నారు. యూరియా కొరతతో రైతులను లైన్లలో నిలబెట్టారని, తరుగు పేరుతో ప్రభుత్వం 2 కిలోలు, మిల్లర్లు 3 కిలోలు వడ్లు కోత విధిస్తున్నారని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడకముందే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.