20 March, 2026 | 10:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోంది

18-09-2024 04:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని సీఎం చెప్పారు.

వ్యవసాయ రంగంలో కూడా యువత ఎదిగే విధంగా ప్రోత్సాహిస్తున్నామని వెల్లడించారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.