20 March, 2026 | 8:41 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అప్పర్ సర్క్యూట్ లో అనిల్ షేర్

18-09-2024 03:59 PM

ముంబాయి: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ జాక్ పాట్ కొట్టారు. ఆయన కంపెనీ రిలయెన్స్ పవర్ కు అతి పెద్ద ఆర్డర్ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రివర్స్ వేలం ద్వారా 500 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు లభించినట్లు  రిలయెన్స్ పవర్ ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత రిలయెన్స్ పవర్ షేర్లు పైపైకి ఎగబాకాయి. సోమవారం రిలయెన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. ఆ రోజు షేర్ ధర 30.30 వద్ద ప్రారంభమైంది. ఆర్డర్ అందుకున్న వెంటనే 31.32 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ప్రారంభమైన వెనువెంటనే 31.51 కి చేరుకుంది.

ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్క సారిగా  లక్షాధికారులుగా మారిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర ఏళ్లలో 2671 శాతం రాబడినిచ్చాయి. 2020మార్చి 20న లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈ రోజు రూ 27.71  లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే. జాక్ పాట్ అంటే ఇదేనని స్టాక్ మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.