13 March, 2026 | 8:35 AM

తులం బంగారం హామీని విస్మరించిన కాంగ్రెస్

13-03-2026 12:00 AM

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, మార్చి 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వధువుకు తులం బంగారం హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గురువారం అల్వాల్ తహసిల్దార్ కార్యాలయంలో 23 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేద కుటుంబాల వారికి కూతురు వివా హం ఆర్థిక భారం కాకుండా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఉపయోగపడతాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమ యంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ధర బాగా పెరిగినందున పేద ప్రజలు బంగారం కొనుగోలు చేయలేకపోతున్నారని అన్నారు. తులం బంగారం ఇస్తే పేద ప్రజలను ఆదుకున్నట్లు అవుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో అల్వాల్ తహసిల్దార్ రాము లు, డిప్యూ టీ తహసిల్దార్ పృథ్వి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్, మాజీ కార్పోరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, అద్భుత అనిల్ కిషోర్ గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, జేఏసీ వెంక న్న, చిన్న యాదవ్, శ్రీధర్ గౌడ్, సంపత్ యాదవ్, శరణగిరి, భాస్కర్‌రెడ్డి, అరవింద్, పవన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.