1 July, 2026 | 4:15 PM

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

01-07-2026 03:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లోని డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్. ఎం. సుధాకర్ , కోఆర్డినేటర్ డాక్టర్. యు. గంగాధర్  ఒక ప్రకటనలో తెలిపారు బి ఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 7 వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు. ఏటా నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా వందలాదిమంది విద్యార్థులకు డిగ్రీ దూరవిద్య అందిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు.