1 July, 2026 | 3:51 PM

విద్యుత్ ప్రమాదంలో బాలుడు మృతి

01-07-2026 03:11 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): విద్యుత్ ఘాతంలో బాలుడు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో చోటుచేసుకుంది... స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపురం గ్రామానికి చెందిన తెప్పని అనిల్ కుమారుడు వర్ధన్ బాబు అలియాస్ పండు (10) వారి సమీప బంధువైన తెప్పని రవి ఇంటిడాబాపై ఆడుతుండగా ఇంటికి నిర్మించినటు వంటి ఐరన్ గ్రిల్స్ తగిలి సృహ తప్పి కింద పడిపోవడంతో వెంటనే గమనించిన బంధువులు హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని బాలుడు తండ్రి అనిల్ ఫిర్యాదు మేరకు హుజూర్ నగర్ ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.