1 July, 2026 | 3:32 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

01-07-2026 02:28 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ బైక్ ను వెనుకనుంచి ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ బైక్ పైనుంచి వెళ్లడంతో బైక్, మృతదేహం నుజ్జునుజ్జు అయ్యాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.