17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ ‘కాళేశ్వరం’.. బీఆర్‌ఎస్ ‘బనకచర్ల’

15-06-2025 01:00 AM

తెలంగాణలో అధికార, ప్రతిపక్షా ల మధ్య అయితే కాళేశ్వరం.. లేక పోతే బనకచర్ల అన్నట్టుగా రాజకీయ పోరు నడుస్తోంది. రేవంత్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ వేయడం.. ఆ కమిషన్ ముందుకు గులాబీ బాస్ కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ హాజరైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం, దానిమీద వేసిన కమిషన్ విచారణ లొల్లి నడుస్తుండగానే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొత్తగా బనకచర్ల ప్రాజె క్టు తెరమీదకు వచ్చింది.

ఏపీ బనకచర్లను కట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్ సర్కా ర్ నిద్రపోతోందని హరీశ్‌రావు మండిపడుతూనే ఉన్నారు. బనకచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తమ ప్రయత్నాలను గట్టిగా చేయాలని, తామూ కలిసి వస్తామని హితువు పలుకుతున్నారు.. కాంగ్రెస్ కాళేశ్వరం, బీఆర్‌ఎస్ బనకచర్ల అంటూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

తమ్మనబోయిన వాసు