calender_icon.png 15 June, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రీబస్సు మహిళలకు.. ఫ్రీ దెబ్బలు వాళ్లకా!

15-06-2025 01:00:23 AM

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని రోజులు ఇది బాగానే ఉన్నా ఆతర్వాత ఫ్రీ బస్సు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఒకరినొకరు తిట్టుకోవడం, సిగపట్లు పట్టుకొని కొట్టుకోవడం లాంటి ఘటనలూ అనేకం జరుగుతున్నాయి.

కానీ ఈ సారి ఆ ఫ్రీ బస్సు తంటాలు బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు వచ్చిపడ్డాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఏమైందో ఏమో గానీ ఇద్దరు మహిళలు ఓ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను తిడుతూ కొడుతున్నారు. పక్కనున్న జనం.. ఫ్రీ బస్సు ఎవరు ఇచ్చారో వాళ్లకి పోయి అడగండి అని ఆ మహిళలతో చెప్తున్నారు. ఈ వీడియోపై వాట్సాపుల్లో పలువురు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఫ్రీ బస్సు మహిళ లకు...ఫ్రీ దెబ్బలు డ్రైవర్లు, కండక్టర్లకా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బస్ డ్రైవర్లను, కండక్టర్లను కొట్టడం, తిట్టడం సరైంది కాదని అంటున్నారు.  రమేశ్ మోతె