12-08-2025 12:07:27 AM
పటాన్ చెరు(అమీన్ పూర్), ఆగస్టు 11 : కాంగ్రెస్ మంత్రులు, నాయకులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పటాన్ చెరు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం అమీన్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు.
మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన అసత్య, అనుచిత వ్యాఖ్యలకు భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కమిషన్లు తీసుకొని ప్రజలను పీడించిన చరిత్ర మీ పార్టీదని వారు విమర్శించారు. పటాన్ చెరు, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.