calender_icon.png 12 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను తప్పించబోయి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు

12-08-2025 12:09:05 AM

మెదక్, ఆగస్టు 11: బైక్ను తప్పించే క్రమంలో ఓ కారు ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవార మెదక్ మండలం పాతూరు శివారులో జరిగింది. మెదక్ వైపు నుండి వెళ్తున్న కారు పాతూర్ వద్దకు రాగానే బైక్ను తప్పించే క్రమంలో రామాయంపేట నుండి విద్యార్థులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది.

దీంతో బ్పై ఉన్న పాతూర్కు చెందిన అనిల్కు గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో బస్సులో ఉన్న కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.