వర్గీకరణకు కాంగ్రెస్ మాల సామాజికవర్గం అడ్డు
- సుప్రీం తీర్పు వచ్చినా రాష్ట్రంలో అమలు చేయడం లేదు
- సీఎంకు బ్రేకులు వేస్తున్న మల్లు, వెంకట స్వామి కుటుంబాలు
- వర్గీకరణకు సమాజం మొత్తం మద్దతిస్తోంది
- బషీర్‌బాగ్ మీట్ ది ప్రెస్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, జనవరి 27 : సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కాం మాల సామాజికవర్గం నేతలు వర్గీకరణను అడ్డుకోవడంతో పాటు సీఎం రేవం తప్పుదోవ పట్టిస్తున్నారని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎప్ప కండువా మార్వనని, ఏ రాజకీయ పా చేరనని మందకృష్ణ స్పష్టం చేశారు. సో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘లక్ష డప్పు వేల గొంతుకలు’ కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ సమన్వయ కర్తగా వ్యవహరించగా టీయూ రా ప్రధాన కార్యదర్శి కే నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్న అడి పలు ప్రశ్నలకు మందకృష్ణ సమాధానమిచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వర్గీకరణను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దేశంలోనే తెలంగాణలో వర్గీకరణను మొట్టమొదలుగా అమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆరోపించారు.
సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు
వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అనుకూలమే అయినప్పటకీ రాష్ట్రం కాంగ్రెస్‌ను శాసించే స్థాయిలో ఉన్న మ వెంటకస్వామి కుటుంబాలు రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని మందకృష్ణ ఆ వీరికి తోడు కాంగ్రెస్ జాతీ నేత కేసీ వేణుగోపాల్ వర్గీకరణకు మోకాలడ్డుతున్నారని విమర్శిం అ అ ఎన్నికల సమయంలో గద్వా సభ రాహుల్ గాంధీ వర్గీకరణకు మద్దతు తెలిపారని..
మేనిఫెస్టోలో సైతం ప్రకటించారని మందకృష్ణ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ అవార్డు ప్రకటించడం పట్ల సీఎం రేవదంత్ రెడ్డి అభినం తెలిపారన్నారు. మాల సామాజికవర్గానికి చెందిన గద్దర్, అందెశ్రీ, గొరటి వెంకన్న లాంటి వారి పేర్లతో జాబితా పం తనతో సీఎం చెప్పారని.. అయి కేవలం లేఖ రాసి ఊరుకున్నారేమోనని తనకు అనుమానంగా ఉందని మందకృష్న తెలిపారు.
మాదిర రిజర్వేషన్‌తో పాటు సామాజిక ఉద్యమాలు నడిపిన నేపథ్యం తనకు ఉందన్నారు. ఆరోగ్యశ్రీ, వికాలాంగుల పెన్షన్‌లాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర తనదని అన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేయాలని మందకృష్ణ డి చేశారు.
దేశం మొత్తం వినపడేలా..
ఎస్సీలో 59 ఉపకులాలు ఉంటే, 58 కులాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వర్గీకరణ న్యాయమైనదే అనే విషయాన్ని అనేక కమిషన్‌లు సైతం నివేదికలు సమర్పించాయన్నారు. తెలంగాణ, దే అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నా వర్గీకరణ అంశం ఎంత బలమైనదో కేం రాష్ట్ర ప్రభుత్వాలకు వినపడేలా ఫిబ్రవరి 7న హైదరాబాద్ వేదికగా ‘లక్ష డప్పు వేల గొంతుకలు’ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. కార్యక్రమానికి మాదిగలు, మద్దతుదారులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
అండగా నిలుస్తున్న సమాజానికి రుణపడి ఉంటా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి వర్గీకరణ డిమాండ్‌కు అండగా నిలుస్తున్న సమాజానికి రుణపడి ఉంటామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వర్గీకరణకు మద్దతుగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి(ఏసీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ ఆర్యవైశ్య మిత్రమండలి సమావేనికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ కోసం తాను అన్ని పార్టీల నాయకుల దగ్గరకు వెళ్లామని చెప్పారు. ఎస్సీల్లోని 58కులాలు వర్గీకరణను కోరుకుంటున్నాయని, కానీ మాలల్లోని కొంతమంది స్వార్థపరులు మాత్రమే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దళితులంతా ఒక వైపు ఉంటే ఒక వర్గమే అడ్డుకుంటోందని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి విషయంలో మాట మార్చినందుకు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడితే అందుకు రెండుసార్లు ఆయన తనను జైల్లో పెట్టించారని అన్నారు. ఏసీపీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






