12 August, 2026 | 11:09 AM

నా కొడుకు కనిపిస్తలేడు సార్

28-01-2025 12:58 AM
  1. ట్యాంక్‌బండ్ అగ్నిప్రమాదంలో యువకుడి గల్లంతు!
  2. కొడుకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు
  3. ప్రమాద సమయంలో ట్యాంక్‌బండ్ వద్ద అజయ్
  4. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  5. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్‌లో ఆదివారం రాత్రి జరిగిన భారత మాతకు హారతి కార్యక్రమంలో భాగంగా క్రాకర్స్ షోలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు దగ్ధమైన ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఓ యువకుడు గల్లంతైనట్లు సమాచారం.

తమ కొడుకు అజయ్ కనిపించడంలేదని అతని కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ట్యాంక్‌బండ్ వద్దకు వచ్చినట్లు తమకు ఫోన్ చేశాడని, ఆదివారం రాత్రి ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి నుంచి అజయ్ ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తోందని, తమ కొడుకు ఆచూకీ తెలపాలని పోలీసులను కోరారు. కాగా హుస్సేన్‌సాగర్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బోట్లతో సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి.  అయితే అజయ్‌కు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు.

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు

ప్రమాద సమయంలో రెండు బోట్లలో దాదాపు ఏడుగురు ఉండగా.. వారిలోని పలువురు గాయపడిన విషయం తెలిసిందే. గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చింతల కృష్ణ, సాయిచంద్, డీ సునీల్, ప్రణీత్‌కు స్వల్ఫంగా గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికి  పొందుతున్నారు. మరో మగ్గురికి నిప్పురవ్వలు కళ్లలో పడటంతో వారిని సరోజిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బాధితులకు అండగా ఉంటాం 

భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్‌లో జరిగిన భారత  హారతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన క్రాకర్స్‌షోలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఫౌండే  ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందిస్తామని, వారి కుటుంబ సభ్యులకు అన్ని బౌ అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు సోమ  ఒక ప్రక  తెలిపారు.

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఎనిమిదేండ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ  వి  నిర్వహించాలని తమ ఫౌండేషన్ భావించిందన్నారు. కాగా తమ ఫౌండేషన్ ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు కార్యక్రమం నిర్వ  బాధ్యతలు అప్పగించగా..

వారు రాజమండ్రికి చెం  ఎస్‌జీ క్రాకర్స్ అనే సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించి క్రాకర్స్ షోతో భారతదేశ పటం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేలా ప్రతిపాదించిందన్నారు. ఈ సంస్థకు వం  అనుభవం ఉం  ఇటీవల ఎల్బీ స్టేడియంలోనూ క్రాకర్స్ షోను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు.