కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ల సోమయ్యకు సన్మానం
మల్లాపూర్, మే, 18(విజయక్రాంతి ):జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మట్ల సోమయ్యకు మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బద్దం నరసయ్య, సర్పంచులు కిరణ్, వెంకటరెడ్డి, వెంకటేష్, వార్డ్ సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు నూతిపెల్లి రాజాం, గాజుల రాజారెడ్డి, నాయకులు సిరిపురం రవీందర్, రాఘవులు, సురేష్, నత్తి రాము, ఎదలాపురం రమేష్, ఎర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మట్ల సోమయ్యకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని నాయకులు ఆకాంక్షించారు. “కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం” అనే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.






