'మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి': కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్
- కాంగ్రెస్ లో ముదురుతున్న మంత్రి కొండా సురేఖ వివాదం.
- కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- చెట్టు మీద ఉండి.. ఆ చెట్టు కొమ్మనే నరుక్కునే వైఖరి సరికాదు.
- సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం.
- సీఎం మూల్యం చెల్లిస్తుంటే.. మీరు ఎంజాయ్ చేస్తున్నారు.
- కొండా కుటుంబం.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వివాదం మరింత ముదురుతోంది. సురేఖ వివాదంపై సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తున్నారు. కొండా సుస్మిత(Konda Sushmita comments) వ్యాఖ్యలను తల్లి సురేఖ ఖండించక పోవడాన్ని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. మంత్రిగా ఉంటూ.. కుమారై వ్యాఖ్యలతో సంబంధం లేదని ఎలా చెప్తారు?, కుమారై మాట్లాడితే మంత్రిగా ఉన్న తల్లికి సంబంధం ఉండదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు అండగా ఉండాలని కోరారు. సొంత పార్టీలో ఉంది.. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిచడం సరికాదని హితవు పలికారు.
కుమార్తె వ్యాఖ్యలతో తల్లి మంత్రి పదవికి గండం
కుమార్తె వ్యాఖ్యలతో తల్లి మంత్రి పదవికి గండంగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తన కూతురు సుస్మిత మాట్లాడిన మాటలను కొండా సురేఖ ఖండించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఏదైనా ఉంటే సీఎల్పీ సమావేశం(CLP Meeting), పీసీసీ సమావేశంలో మాట్లాడాలని సూచించారు. సీఎం, పార్టీ గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎం పై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. పార్టీలోనూ ఉంటూ సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదని పేర్కొన్నారు. చెట్టు మీద ఉండి.. ఆ చెట్టు కొమ్మనే నరుక్కునే వైఖరి సరికాదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. సుస్మిత(Sushmita comments) వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్లు అవుతూందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండ సురేఖ చెప్పడం సరికాదన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేకుంటే కొండా సురేఖ ఖండించాలని డిమాండ్ చేశారు. మీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని, సీఎం మూల్యం చెల్లిస్తుంటే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు.
కొండా కుటుంబం భాష ఎప్పుడూ పార్టీకి తలనొప్పిగానే ఉందని తెలిపారు. కొండా సురేఖ గతంలోనూ నోరుజారి పార్టీకి ఇబ్బంది తెచ్చారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఆయన సోదరులు కష్టపడ్డారని తెలిపారు. సీఎం పై అనవసర ఆరోపణలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్న ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారిన వ్యక్తులను పదవుల నుంచి సీఎం తప్పించాలని కోరారు. సీఎంను బలహీనపరచాలనే ప్రతిపక్షాల ఆలోచనలను వీరు అమలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం, ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కి ప్రజల్లో బలం ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించిన వారికి షోకాజ్ నోటీసులు(Show-cause notices) ఇచ్చి సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






