బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా దాసరి మంజుల
తుంగతుర్తి, (విజయక్రాంతి): బిజెపి పార్టీ మహిళా మోర్చా సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలీగా మండల పరిధిలోని వెంపటి గ్రామ ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు ను నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా బీజేపీలో కొనసాగుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న మంజులకు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, స్థానిక బీజేపీ నేతలు తనపై పెట్టిన నమ్మకానికి తగినట్టుగా పార్టీకి సేవలందిస్తానని ఈ సందర్భంగా మంజుల పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కంచర్ల నర్సిరెడ్డి, నాయకులు గుండ్ల సత్యనారాయణ, గుండగాని అంజయ్య, అబ్బగాని ఎల్లయ్య, గుండ గాని మల్లయ్య, పోన్నం రాములు తదితరులు మంజులకు శుభాకాంక్షలు తెలియజేశారు.






