రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ కు లేదు
- బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుపైకాంగ్రెస్ కు లేదనీ బిజెపి పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ, కరీంనగర్ జిల్లా నుండి దేశ ప్రధానిగా ఎదిగి, దేశ గతిని మార్చడంలో, సంస్కరణలో కీలక పాత్ర వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించడంపై ఆ పార్టీ ద్వంద్వ నీతి బహిర్గతమైందన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి రక్షించిన సంస్కర్త, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ అయిన పీవీ నరసింహారావును విస్మరించి, ప్రభుత్వ ఖర్చుతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం కాంగ్రెస్ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రవీణ్ రావు విమర్శించారు.






