15 April, 2026 | 2:21 AM

దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్

29-12-2025 01:30 AM

- ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

పినపాక, డిసెంబర్ 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అ ధ్యక్షులు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అ ధ్యక్షులు గోడిశాల రామనాదం పార్టీ జెండా ఆవిష్కరించారు..

అదేవిధంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ పేరు మార్చి వి బి జి రామ్ జి అనే పేరుతో నామకరణం చేసి కొత్త బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదించడంపై వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వా రు మాట్లాడుతూ, 141 సంవత్సరాల కాంగ్రె స్ పార్టీ దేశ స్వాతంత్రం తెచ్చిన గొప్ప చరిత్ర గల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అధికారంలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజల కోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 140 సంవత్సరాలు పూర్తయి 141వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గా రు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దే శానికి స్వాతంత్రం రావడం కొరకు కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడిందని గుర్తు చేశా రు, పార్టీ సముద్రం లాంటిదని ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన జాతీయ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవి ధంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం పేదల హక్కులపై దాడి చేస్తుందని  పేరు మార్పును అం గీకరించమని అన్నారు.

కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జా తీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును రాజకీయ స్వార్థం కోసం మార్చడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన చేపట్టడం జరిగింద న్నారు. అధికార అహంకారంతో ప్రజలను మభ్యపెడుతూ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని  సూచించారు. ప్రజల హక్కులు సంక్షేమ పథకాలను కాపాడేందుకు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, గంగారెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, కంది సుబ్బారెడ్డి, పడాల రాము, సూతరపు వీర న్న, అత్తి లక్ష్మి నారరాయణ, జరుపుల రా ము   పినపాక మండలంలో గెలిచిన 16 గ్రామపంచాయతీల  సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు నెంబర్లు, మండల నాయ కులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.