గ్రామీణ వైద్యంలో ఆర్‌ఎంపీలది ప్రముఖ పాత్ర
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట, డిసెంబర్ 28,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయ డంలో ఆర్ ఎం పి వైద్యులు ప్రముఖ పోషిస్తున్నారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం వినాయకపురం లోని చిలకల గండి ముత్యాల మ్మ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఆర్ ఎం పి డబ్ల్యు ఏ మండల సమావేశం లో ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ ఎం పి లు తమ పరిధులు దాటి వైద్యం చేయవద్దని, ఆర్ ఎం పి ల విషయాన్ని అసెంబ్లీ లో చర్చిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కాపాడేది ఆర్ ఎం పి లేని అన్నారు. తనకు విద్య, వైద్యం అంటే చాల మక్కువ అని మొదటి ప్రాధాన్యత వాటికే అన్నారు.
ఈ కార్యక్రమం లో ఆర్ ఎం పి డబ్ల్యూ ఏ జిల్లా అధ్యక్షులు కొమరయ్య, రామ్మూర్తి, రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మెన్ సుంకవల్లి7 వీరభద్ర రావు, గ్రామీణ ప్రాంత వైద్యులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా షేక్ బాబా,గౌరవ అధ్యక్షులుగా కా సిం భక్షి,కార్యదర్శిగా పంబి ప్రసా ద్,జాయింట్ కార్యదర్శి గా అజీజ్,ఉపాధ్యక్షుడుగా తాతారావు,కోశాధికారిగా వి సత్య నారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి గా బాబు రావు,మీడియా కో ఆర్డినేటర్ గా సయ్యద్ హజరత్ అలీ,ప్రచార కార్యదర్శి గా సతీష్, సహాయ కార్యదర్శి గా వి ప్రసాద్,మహిళా ప్రతినిధిగా రీనా సర్కార్.




