24 July, 2026 | 9:25 PM

కాంగ్రెస్ నిరసనలు రాజకీయ స్వార్థమే

24-07-2026 08:20 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలు పూర్తిగా రాజకీయ స్వార్థంతో కూడుకున్నవేనని బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టబద్ధమైన విచారణలను రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, అనవసర రాజకీయ ఆందోళనలను విరమించాలని ఆయన సూచించారు