కల్లూరులో పాఠశాలలు బంద్ విజయవంతం
బంద్ లో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ
కల్లూరు,(విజయ క్రాంతి): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) పిలుపు మేరకు శుక్రవారం కల్లూరు మండలంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడగా బంద్‌కు విస్తృత మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మాట్లాడుతూ... నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల లీకేజీల వల్ల అనేక మంది విద్యార్థులు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని, కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయని విమర్శించిన వారు, ప్రజలు సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు.






