24 July, 2026 | 10:18 PM

స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు

24-07-2026 09:15 PM

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): గౌహతి ఐ.ఐ.టి. ప్రొఫెసర్స్ డా. రాజ్‌కుమార్, డా. శిరీష ముఖ్య అతిధులుగా పాల్గొని ఫ్రెషర్స్ డేను ఘనంగా ప్రారంభించారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సూర్య రిసార్ట్ యందు నిర్వహించిన ఫ్రెషర్స్ డేకు గౌహతి ఐ.ఐ.టి. ప్రొఫెసర్స్ డా. రాజ్‌కుమార్, డా. శిరీష ముఖ్య అతిధులుగా పాల్గొని స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్స్ కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా గౌహతి ఐ.ఐ.టి. ప్రొఫెసర్స్ డా॥రాజ్‌కుమార్, డా॥శిరీష గార్లు మాట్లాడుతూ, ఖమ్మంలో స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డేలో పాల్గోనడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ, జె.ఈ.ఈ.మెయిన్స్, అడ్వాన్స్‌లో సీటు లక్ష్యంగా సాధన చేసే విద్యార్థులు క్రమశిక్షణ అంకితబావం, ధృడమైన సంకల్పం, నిరంతర ఉపాసన, తెలుసుకోవాలని ఆసక్తి, స్థిరత్వం, వినయం, కృతజ్ఞత భావం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని నేటి యుతవతరానికి చాలెంజ్‌గా మారిన సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా విద్యార్థులు గ్రూప్ స్టడీస్ చేయడం, బయటికి చదవడం వలన వారు చదివిన అంశాలు బాగా జ్ఞాపకం ఉంటాయని, అలాగే గొప్ప వ్యక్తులు జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి పొందాలని, ఈ వయస్సులో ఉండే ఒత్తిడిని అదిగమించి సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ కాలేజ్‌లో ఉన్న జె.ఈ.ఈ.మెయిన్స్, అడ్వాన్స్ సినీయర్ ఫ్యాకల్టి భోదనలు శ్రద్ధగా వింటూ నిరంతర సాధన చేసి, మీ తల్లిదండ్రుల ఆశయాలకనుగూణంగా ఐ.ఐ.టి. సీటే లక్ష్యంగా నిరంతరమైన కృషితో సాధ్యమవుతుందని విద్యార్థులను ఉత్సాహపరిచి వారిలో స్ఫూర్తిని నింపారు.

ఐ.ఐ.టి.గౌహతిలో ప్రొఫెసర్స్‌గా ఉన్న మమ్ములను పిలిచి విద్యార్థులకు పరిచయం చేసి వారిని ప్రేరేపించడానికి స్టెమ్‌స్పార్క్ మేనేజ్‌మెంట్ కొండా శ్రీధర్‌రావు గారు చేసిన ప్రయత్నానికి అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో కాలేజ్ డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు గారు మాట్లాడుతూ స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ 2024-2025 సంవత్సరమున జె.ఈ.ఈ.మెయిన్స్, అడ్వాన్స్ సీట్లే లక్ష్యంగా స్థాపించబడిందని మొదటి ప్రయత్నంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఐ.ఐ.టి., యన్.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి. వంటి ప్రతిష్టాత్మక సీట్లు, ఎప్‌సెట్‌లో స్టేట్ బెస్ట్ ర్యాంకుతో పాటు ఎక్కువ మంది విద్యార్థులు రాష్టస్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజ్‌లలో సీట్లు సాధించారని, భవిష్యత్‌లో ప్రతి విద్యార్థి  ఐ.ఐ.టి., యన్.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి.లలో సీట్లు సాధించడానికి బాటలు పడ్డాయని తెలియజేసారు. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన మెయిన్స్, అడ్వాన్స్ ఫ్యాకల్టితో నిరంతర ప్రణాళిక, శ్రద్ధతో ఎల్లప్పుడూ అందుబాటులో      ఉంటూ తల్లిదండ్రుల ఆశలకు, విద్యార్థుల ఆశయాలకు అనుగూణంగా కృషి చేస్తున్నామని తెలుపుటకు మా విద్యార్థులు సాధించిన సీట్లే సాక్ష్యమని తెలియజేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.