కాంగ్రెస్ పాలన అంతా దగా.. దగా
100రోజులన్నారు.. 1000 రోజులైనా అమలు చేయలేదు
కేసముద్రం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): అలవి కాని హామీలతో(Guarantees).. గద్దనెక్కిన కాంగ్రెస్(Congress).. ఎన్నికలకు(elections) ముందు ప్రజలకు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల(six guarantees) పేరుతో పథకాలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్(Satyavati Rathod) ఆరోపించారు.
1000 రోజుల కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన సాగించిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని విమర్శిస్తూ బీఆర్‌ఎస్ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Banoth Shankar Naik) ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ , మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునుడు.. దాచుకొనుడు తప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.
ఎన్నికలకు ముందు మహిళలకు 2,500, విద్యార్థులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల పెంపు తదితర అంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన కేసీఆర్ గత పదివేల కాలంలో ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలకు తిరోదకాలిచ్చిందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరంతరం కొట్లాడుతుందన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి ని చేయాలని చూస్తున్నారన్నారు. మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఎగవేసిందని, కాంగ్రెస్ నేతలు దోచుకోవడం దాచుకోవడం.. ఢిల్లీకి కప్పం కట్టడం తోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ రైతులు సాగు నీరు కోసం అల్లాడుతున్నారని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం అనేక విధాలుగా తపన పడ్డారని, ఇప్పుడు కనీసం సాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఎస్సారెస్పీ కాలువలు నీళ్లు లేక వట్టిపోతున్నాయని విమర్శించారు. పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలిచి నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో వంట వార్పు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.






