టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు
టీ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్
బొంతు రామ్మోహన్‌కు కీలక బాధ్యతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం(Telangana RTC Recognized Union) ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 9న జరగనున్నఈ ఎన్నికల్లో ’తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్’ (టీడబ్ల్యూయూ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జి ల్లాల అధ్యక్షులకు సమాచారం అందించా రు.
టీడబ్ల్యూయూ కాంగ్రెస్‌కు అనుబంధం గా పనిచేస్తోందని తెలిపారు. తమతమ ని యోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో టీడబ్ల్యూయూకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎన్నికలు, స్థానిక నేతల మధ్య సమన్వయకర్తగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, జీహెచ్ఎంసీ మాజీ మే యర్ బొంతు రామ్మోహన్‌ను నియమిస్తున్నట్లు పార్టీ స్టేట్ చీఫ్ వెల్లడించారు. బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ఆ ర్టీసీ కార్మికులు కలిసి పనిచేసి టీడబ్ల్యూయూ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల కు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేశారు.