కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!
సీపీ సజ్జనార్ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ కానిస్టేబుల్ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనం రేపింది. సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కానిస్టేబుల్ యాదగిరి ఒంటిపై రక్తం కనిపిస్తోంది. తీవ్రమైన గాయాలతో ఆయన ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు సీపీ వేధింపులే కారణమని, వాస్తవాలు తెలుసుకోకుండా తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, కనీసం విచారణ జరపకుండానే తనను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు.
‘సీపీ గారూ.. మీ వేధింపుల వల్ల నేను మనస్తాపం చెందాను. అందుకే నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. పైస్థాయి అధికారుల మెప్పు కోసమో లేదా వ్యవస్థలోని లోపాల వల్లో తనలాంటి సామాన్య కానిస్టేబుళ్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వీడియో ముగింపులో ‘నేను శివార్పణమ్ అయిపోతున్నా అంటూ తన ప్రాణత్యాగానికి సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సదరు కాని స్టేబుల్ ఎక్కడ ఉన్నారు? క్షేమంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కనిపెట్టేందుకు ప్రత్యే క బృందాలు రంగంలోకి దిగాయి.
అన్నీ అబద్ధాలే: సీపీ కార్యాలయం
కానిస్టేబుల్ యాదగిరి విడుదల చేసిన వీడియోలో చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఉన్నతాధికారులపై ఆయన చేస్తు న్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని సీపీ కార్యాలయం స్పష్టం చేసిం ది. కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, డ్యూటీ సమయం లో నిద్రపోవడం, యూనిఫాం నిబంధనలు పాటిం చకపోవడం, ఎటువంటి సమాచారం లేకుండా విధులకు రాకపోవడం ఇలాంటి ఆరోపణలతో శని వారం ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొంది.
తప్పుల నుంచి తప్పించుకోవడానికి అధికారులను భయపెట్టాలని ఆత్మహత్య డ్రా మా ఆడుతూ వీడియో చిత్రీకరించారని పో లీసులు తెలిపారు. యాదగిరికి గతంలో ఎస్సార్‌నగర్‌లో చిరు వ్యాపారుల వద్ద వసూళ్లు చేస్తూ సస్పెం డ్ అయ్యాడని, మోఘల్పురాలో గ్రూపు లు కట్టి అధికారులను ఇబ్బంది పెట్టాడని, బోరబం డలో బెల్ట్ షాపుల యజమానులను వేధించాడని పేర్కొన్నారు.




