15 March, 2026 | 3:44 AM

నేటి నుంచి 20 వరకు వర్షాలే

15-03-2026 12:47 AM

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. ఆదివారం నుంచి 20వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయ ని పేర్కొంది. నేడు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌న గర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పడనున్నాయి.