calender_icon.png 28 June, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అరెస్ట్

19-05-2025 12:26:44 AM

  1. పోలీసు వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్స్ చోరీ 

ఇతరులకు విక్రయించి డబ్బులు వసూలు 

రాజేంద్రనగర్, మే 18: పోలీసు వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్స్ అపహరించి ఇతరు లకు విక్రయించి డబ్బులు వసూలు చేస్తున్న శిక్షణ పొందుతున్న ఓ కానిస్టేబుల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ బాలరా జు ఆదివారం రాత్రి మీడియాకు వెల్లడించారు.  పీటీ ఓ కింద శిక్షణ పొందుతున్న పో లీస్ కానిస్టేబుల్ (గతంలో పి టీ ఓ లో హోమ్ గార్డ్ డ్రైవర్గా పనిచేశాడు) నిస్సార్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

అతను ఆఫీసు నుండి 10 పోలీసు వాహనాల ఫాస్ట్ట్యాగ్లను దొంగిలించి విమానాశ్రయంలోని ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చి విమానాశ్రయంలో టోల్ ఛార్జీలను, ఓఆర్ ఆర్ పై ఛార్జిలను నివారి నివారించడానికి ప్రయత్నించాడు. తరువాత అతను క్యాబ్ డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేశాడు.

(ప్రతి ట్యాగ్కు ముందు విమానాశ్రయంలో 8000 ట్యాగ్లు) ఇప్పుడు ప్రతి ట్యాగ్కు ఓ ఆర్ ఆర్ పై 2000 వసూలు చేస్తున్నాడు. టోల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేసి 3 క్యాబ్లను సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.