16 April, 2026 | 1:37 AM

ఆధునిక సదుపాయాలతో భవన నిర్మాణం

16-04-2026 12:33 AM

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం 

అశ్వాపురం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి):  అశ్వాపురం మండలంలోని పలు గ్రామాల్లో  బుధవారం   నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామంలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఈ భవనం కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు.

గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి స్థలం అందించిన చెన్నం సత్యనారాయణ, ప్రసాద్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జగ్గారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు సాంగ్ సైదమ్మ, వేముల శిరీష, ముమ్మడి స్వరూపలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం గొల్లగూడెం గ్రామంలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారుల పోషణ, అభివృద్ధి, విద్యకు అంగన్వాడి కేంద్రాలు కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ముత్యాలరావు, హౌసింగ్ ఏఈ ఉదయ్కుమార్, ఎంఆర్వో సూర్యప్రకాశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, స్థానిక నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.