3 August, 2026 | 7:25 PM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

03-08-2026 06:32 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు నాణ్యతతో పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.