ఘనంగా గోపూజ
03-08-2026 06:27 PM
మేళ్లచెరువు,(విజయక్రాంతి): స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం పర్వదినం పురస్కరించుకొని, శంభు లింగేశ్వర స్వామి వారికి అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. సోమవారం తెల్లవారుజామునే స్వామి వారికి ప్రత్యేక అభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఇష్టకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకములు, ఘనంగా జరిగాయి.
అనంతరం భక్తుల సమక్షంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నప్రాసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎన్. శంబిరెడ్డి,ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెండ్లి లచ్చయ్య, పాలకవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవమణి, రామారావు, నాగరాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






