3 August, 2026 | 7:25 PM

మంద బొగుడ వాసుల కష్టాలు తీర్చండి

03-08-2026 06:24 PM

మాజీ ఎంపీకి విన్నవించిన గ్రామస్తులు

బోథ్,(విజయక్రాంతి) మండలంలోని మంద బొగుడ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు మాజీ ఎంపీ సోయం బాబురావుకు విన్నవించారు. సోమవారం వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ నివాసంలో గ్రామ సమస్యలను వివరించారు ముఖ్యంగా గ్రామపంచాయతీ కార్యాలయం లేక ఇబ్బందికరంగా ఉందని కమ్యూనిటీ హాల్ అంగన్వాడి భవనం దండారి షెడ్డు నిర్మించాలని గ్రామస్తులు మాజీ ఎంపీకి వివరించారు.

గ్రామానికి సరియైన రోడ్డు వసతి లేదని గ్రామంలో అనేకమందికి పూరి గుడిసెలు ఉన్నాయని ఇందిరమయంలో మంజూరు చేసి రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చూడాలని మాజీ ఎంపీకి విన్నవించారు. గ్రామస్తుల సమస్యల మీద మాజీ ఎంపీ అధికారులతో మాట్లాడి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అంతేగాక గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించే దిశ కృషి చేయాలని అందుకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని వివరించారు. గ్రామస్తులు ఓపికగా ఉండాలని సమస్యను పరిష్కరించే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు.