8 July, 2026 | 4:09 PM

ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి

08-07-2026 03:10 PM

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

మెట్ పల్లి,జూలై 8(విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.మెట్‌పల్లి పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం, ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి నిర్మాణంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించడంలో ఈ భవనాలు కీలకమని పేర్కొన్న కలెక్టర్, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన సామగ్రిని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.