15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తక్షణ వైద్య సేవలకు సంప్రదించండి

15-02-2026 03:05 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

భక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు 255 మంది సిబ్బందితో వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

అందుబాటులో ఉండే శిబిరాల వివరాలు

1.భీమేశ్వర స్వామి ఆలయ అంతర్భాగం

2.లడ్డూ కౌంటర్ సమీపం

3.కల్యాణ కట్ట

4.గుడి చెరువు లెవెల్ చేసిన ప్రాంతం (శివార్చనం ప్రాంగణం)

5. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేములవాడ

6.అమ్మవారి అతిథి గృహం

7.ఈ.ఓ. కాంప్లెక్స్ (భీమేశ్వర సదన్

8.బస్తీ దవాఖాన వేములవాడ 

9.స్పెషల్ క్యాంప్ ఏరియా ఆసుపత్రి వేములవాడ 

1.కోరుట్ల బస్టాండ్

2.జగిత్యాల బస్టాండ్

3.తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్

4.అగ్రహారం ఆలయం

5.నాంపల్లి ఆలయం

6.సంస్కృత కళాశాల

ప్రత్యేక బృందాలు:

1.రెస్క్యూ టీమ్

2.క్విక్ రెస్పాన్స్ టీమ్

3.యాంటీ లార్వా & ఫాగింగ్ ఆపరేషన్ బృందం

4.కంట్రోల్ రూమ్

5.రిజర్వ్ వైద్య సిబ్బంది

భక్తులు వైద్య అవసరాలు ఉన్నప్పుడు సమీపంలోని వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని  అధికారులు సూచించారు. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.