15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మేము పాలకులం కాదు.. సేవకులం

15-02-2026 02:23 PM

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ఆదివారం సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భోగ్ బండార్, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన హస్తకళల ప్రదర్శన జరిగింది. సేవాలాల్ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నానని, ప్రతి తండాలో పాఠశాల భవనాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. 

తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంటు ఇచ్చేందుకు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, 51 లక్షల పేదల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందని, 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు గ్రూప్-1 ఉద్యోగాలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం వద్ద భూములు లేవు, సంక్షేమంతోపాటు విద్య ఇవ్వాలనుకుంటున్నారని, చదువు వల్ల కీలక పదవులు వస్తాయని, చదువుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.

మేము పాలకులం కాదు సేవకులమని, ప్రజలకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. కానీ పాలకుడిగా తను ఎప్పుడూ ప్రవర్తించలేదని, నేను సేవకుడిగా మాత్రమే ప్రవరిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారికి మేలు చేశామని, గెలుపు.. ఓటమి అన్నింటికి నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పామని అన్నారు. వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచన నాది అని, ఎస్పీలు 17 శాతం ఉంటే.. మా ప్రభుత్వలో 30 శాతం ఉన్నారు. దళితులకు మంత్రులు, స్పీకర్ పదవి ఇచ్చామని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్ష నేతలు ప్రజలను నిందిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.