calender_icon.png 9 February, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

09-02-2026 12:58:53 AM

ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలను పరిష్కరించేం దుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ ఫేజ్1లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నేమురి మహేష్ గౌడ్, బుచ్చన్న, శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పాండాల శివకుమార్ గౌడ్,  సోనియా గాంధీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిక్షపతి వంశరాజ్, గౌరవ అధ్యక్షుడు మైలారం బాల నరసింహ, సిద్ధులు, బంకు శ్రీను, గొల్లకిట్టు, టీడీపీ సీనియర్ నాయకులు రాముల యాదవ్, తాండ్ర యాదగిరి, కాలనీవాసులు తదితరులు హాజరయ్యారు.