09-02-2026 12:57:11 AM
విద్యార్థుల కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు వేలం వేసే బదులు ఆ స్థలాలను బీసీ హాస్టళ్ళు, గురుకులాల సొంత భవనాల నిర్మాణం కోసం విని యోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డి మాండ్ చేశారు. అదనంగా 150 బీసీ కాలేజ్ హాస్టళ్ళు, 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతి ధిగా పాల్గొని మాట్లాడారు. హాస్టళ్ళ నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు.
ప్రభుత్వ స్థలాలు, ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్ కు నిర్మాణానికి ఉపయోగించాలని, అంతే గాని అమ్మడానికి కాదన్నారు. హాస్టళ్లకు, గురుకులాలకు ఇచ్చిన తరువాత అమ్మకాలకు పోవాలన్నారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, సీ. రాజేందర్, శివ కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, జిల్లపల్లి అంజి, చిక్కుడు బాలయ్య, ప్రభాకర్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.