20 March, 2026 | 9:37 AM

కోయగూడెం ఓసీలో రోడ్డు క్లీనింగ్ మిషన్‌ను అడ్డుకున్న కాంట్రాక్టు కార్మికులు

20-03-2026 12:00 AM

టేకులపల్లి, మార్చి 19,(విజయక్రాంతి): ఎఐటియుసి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయుసి ల ఆద్వర్యంలో టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసిలో రోడ్డు క్లీనింగ్ మిషన్ ను పనులు చేయనీయకుండా నాయకులు, కాంట్రాక్టు కార్మికులు గురువారం అడ్డుకున్నారు. ఈసందర్భంగా గుర్తింపు సంఘం బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, ప్రాతినిధ్య సంఘం కోసూరి సత్యనారాయణలు మాట్లాడుతూ..

కోయగూడెం ఓసీ ప్రారంభం 2002 నుంచి పనిచేస్తున్న సుమారు 23 మంది హౌస్ కీపీంగ్, సివిల్ సంబంధించిన కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తు కుటుంబాలను పోషించుకుంటు జీవిస్తున్న వారి కుటుంబాల్లో చీకటి అలుముకుందని ఆవేదన వ్యక్తంచేశారు. అకస్మాత్తుగా యాజమాన్యం రోడ్డు క్లీనింగ్ మిషన్ తెచ్చి 16 మంది కార్మికులను రోడ్డు పాలుచేసారని అన్నారు. 22 సంవత్సరాలుగా పనిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు నేడు యాజమాన్యం నిర్లక్ష్యంగా పనిని నుంచి తొలగించడం సరికాదని అన్నారు.

యాజమాన్యం వెంటనే స్పందించి రోడ్డు క్లీనింగ్ మిషన్  తొలగించి పనుల నుంచి తొలగించిన  కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండి రోడ్డు క్లీనింగ్ మిషన్ తొలగించే వరకు తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైదులు, ఎర్ర బాలు, సత్యనారాయణ, రాంకూమార్, మంగ్య, బాలు, రాంచందర్, శివ, రాజశేఖర్, అవినాష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.