17 April, 2026 | 7:13 PM

యువ క్రీడాకారుడికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించిన కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్

11-06-2025 12:35 AM

భద్రాచలం, జూన్ 10 (విజయ క్రాంతి) బ్రెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలంలో శిక్షణ  పొందుతూ ఇటీవల  హైదరాబాదులో జరిగినటువంటి క్రికెట్ లీగ్ ఫ్రెండ్లీ మ్యాచ్లో 73 బంతుల్లో 214 పరుగులు చేసి 17 సీక్సులు 22 ఫోర్లు సాధించిన భద్రాచలానికి చెందిన జి  ప్రసన్న కుమార్ ని భద్రాచలం  చెందిన పట్టణ ప్రముఖులు, ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ మంగళవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా క్రీడాకారుడు ఆర్థికంగా పేదవాడిని  విష యాన్ని భద్రాచలం రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు, క్రికెట్ అభిమాని షేక్ అజీమ్ ద్వారా తెలుసుకుని తన నివాసంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానించి శాలవతో సత్కరించి క్రికెట్ కిట్ కు కావాల్సిన  రూ 15వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ క్రికెట్ అకాడమీ కోచ్ శ్రావణ్ తేజ క్రీడాకారులు పాల్గొన్నారు.