18 April, 2026 | 2:29 PM

పాఠశాల వంటగది స్లాబ్ పెచ్చులు పడి వంట మనిషికి గాయాలు

12-04-2025 01:09 AM

టేకులపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం  బొమ్మనపల్లి మండల పరిషత్  ప్రాథమిక పాఠశాల వంటగది స్లాబ్ పెచ్చులు పడి వంట మనిషికి గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట చేస్తుండగా స్లాబ్ కింద మొత్తం పెచ్చులు పడిపోయి వంట మొత్తం చెడిపోయింది.

ఎండిఎం వంట మనిషి  బందా సరోజ కు చేతికి గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాపాయం తప్పింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వంట గదికి  మరమ్మతులు చేశారు. పనుల్లో నాణ్యత లోపించడంతో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.